Site icon HashtagU Telugu

Surat Murder: సూరత్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య

Rape Imresizer

Rape Imresizer

సూరత్ జిల్లాలో 11 ఏళ్ల బాలికపై ఆదివారం సాయంత్రం అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూరత్ జిల్లాలోని జోల్వా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిపై అనుమానంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

బాలికల తల్లిదండ్రులు — దినసరి కూలీలు ఇద్దరూ తమ కుమార్తె తప్పిపోయినట్లు గుర్తించారు. అనంతరం ఇంటి సమీపంలోని ఓ భవనంలోని ఓ గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక కుటుంబీకులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూరత్‌లోని కొత్త సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం సూరత్ రేంజ్ ఐజీ రాజ్‌కుమార్ పాండియన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.