Site icon HashtagU Telugu

Deepika & Ranveer Buy Costly Flat: ఖరీదైన ఫ్లాట్ లోకి బాలీవుడ్ జంట.. వామ్మో అన్ని కోట్లా!

Deepika And Ranveer

Deepika And Ranveer

బాలీవుడ్ బ్యూటీపుల్ కపుల్ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ముంబైలోని బాంద్రాలోని లష్ రెసిడెన్షియల్ టవర్ లోని ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. 119 కోట్ల రూపాయలకు ఫ్లాట్ ను సొంతం చేసుకున్నారు. ఇది దేశంలో కాస్ట్ లీ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌. ఇక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల పక్కన ఉంటారు కూడా. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె గత జూలై 10వ తేదీ రాత్రి యుఎస్ టూర్ నుండి తిరిగి వచ్చారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట చేయి చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. ఈ మధ్య, ఇద్దరూ ముంబైలోని బాంద్రాలో ఫ్లాట్ కొనుగోలు చేసిందని బాలీవుడ్ టాక్.

119 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఇల్లు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్, షారూఖ్ ఖాన్ మన్నత్ బంగ్లా మధ్య ఉంది. ఆ ప్లాట్ 16, 17, 18, 19 అంతస్తులలో ఉంది. ఇది మొత్తం 11,266 చదరపు అడుగులు కార్పెట్ ప్రాంతం, 1,300 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. ప్రస్తుతం దీపికా పదుకొణె షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌లో నటించనుంది. హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి కూడా నటిస్తోంది. ప్రభాస్‌లతో కలిసి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కెలో దీపిక హీరోగా నటిస్తోంది. హీరో రణ్‌వీర్ సింగ్ చివరిగా మే 13న విడుదలైన జయేష్‌భాయ్ జోర్దార్‌లో కనిపించాడు.  ప్రస్తుతం సర్కస్‌తో పూజా హెగ్డే తో కలిసి నటించనున్నాడు. అలియా భట్‌తో కలిసి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు.