Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారని, 56 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని, అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎవరినీ బాధ్యులను చేయలేదని అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.
Randeep Surjewala
సుర్జేవాలా మాట్లాడుతూ… సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం వల్లే బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిందని ప్రాథమిక వార్తా నివేదికలు సూచిస్తున్నాయని, అయితే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యంపై ఇచ్చిన క్లిష్టమైన హెచ్చరిక గురించి రైల్వే మంత్రి మరియు రైల్వే మంత్రిత్వ శాఖకు తెలియదని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే రైల్వే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని సూర్జేవాలా అన్నారు. ఇటీవల పలు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పినట్లు సూర్జేవాలా తెలిపారు. ఈ ప్రమాదాల్లో చాలా మంది లోకో పైలట్లు మృతి చెందగా, అనేక వ్యాగన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే మంత్రి మరియు రైల్వే మంత్రిత్వ శాఖ ముందస్తుగా ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
రైల్వే మంత్రి రైల్వే భద్రతపై దృష్టి సారించడం కంటే మార్కెటింగ్ మరియు ప్రధాన మంత్రిని సంతోషపెట్టడం గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఫైర్ అయ్యారు. రైల్వే భద్రతలో పెరుగుతున్న లోపానికి అవసరమైన సిబ్బంది కొరత కారణం కాదా – గ్యాంగ్‌మెన్, స్టేషన్ మాస్టర్లు, లోకో పైలట్ల కొరత ఉందని చెప్పారు. 2022-23 సంవత్సరంలో 48 రైలు ప్రమాదాలు జరిగాయి, అంతకుముందు సంవత్సరంలో 35 ప్రాణాంతక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. కవాచ్ అని పిలిచే ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ రైల్వే జోన్‌లో ఎందుకు అమలు చేయబడలేదని సూటిగా ప్రశ్నించారు. రైలు నెట్‌వర్క్‌లో కేవలం 2% అంటే 68,000 కి.మీ రైల్వే నెట్‌వర్క్‌లో 1,450 కి.మీ మాత్రమే ‘కవాచ్’ ద్వారా కవర్ చేయబడిందనేది నిజం కాదా ఇదేనా మీ శాఖా తీసుకునే భద్రతా అంటూ రైల్వే మంత్రిపై ఘాటుగా స్పందించారు.
Read More: 1 Year 23 Hours : ఒక్క సంవత్సరం 23 గంటలేనట.. ఎక్కడంటే ?