Alia Wedding Date: ఆలియా, రణబీర్ కపూర్ పెళ్లి తేదీలో ట్విస్ట్…!!

బాలీవుడ్ లో ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి గురించి ఒకటే చర్చ జరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Alia Ranbir

Alia Ranbir

బాలీవుడ్ లో ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి గురించి ఒకటే చర్చ జరుగుతోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి చేసుకోనున్నారని…కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాదు ఏప్రిల్ 15న జరుగుతుందని…మరికొంతమంది అంటున్నారు. అసలు వీరి పెళ్లి ఎప్పుడు..? వీరికి వివాహానికి సంబంధించి రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తుంది. అంతేకాదు రణబీర్, ఆలియాల పెళ్లి వాయిదా పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. పెళ్లి ఎప్పుడు అనే వార్త కొంత గందరగోళానికి తెరలేపింది. అయితే ఈ విషయంపై నీతూ కపూర్ ప్రశ్నిస్తుంటే ఆమె స్పందించకపోవడం ఈ పుకార్లకు తెరలేపినట్లు అవుతోంది.

ఆలియా భట్ మేనమామ రాబిన్ భట్…ఏప్రిల్ 13న మెహందీ వేడుక జరుగుతుందని…పెళ్లి ఏప్రిల్ 14న జరుగుతుందని తెలిపాడు. ఇప్పుడు ఆలియా సోదరుడు రాహుల్ భట్….వారి పెళ్లి తేదీ మారిందని ఓ న్యూస్ ఛానెల్ తో తెలిపాడు. మొదట ఏప్రిల్ 14న పెళ్లి అనుకున్నప్పటికీ…మీడియాకు తేదీ లీక్ కావడంతో…తేదీని మార్చాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పాడు. భద్రత పరంగానే పెళ్లి తేదీని వాయిదా వేయడం ఒక కారణంగా చెబుతున్నారు. పెళ్లికి సంబంధించిన వార్త బయటకు లీక్ కావడంతోనే…పెళ్లి తేదీలను మార్చినట్లు రాహుల్ భట్ చెప్పాడు. మొత్తానికి ఏప్రిల్ 20లో ఏదొక తేదీలో పెళ్లి జరగడం ఖాయమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు.

  Last Updated: 12 Apr 2022, 12:20 PM IST