రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ మహోత్సవం ముగిసింది. ఇద్దరూ ఏడు అడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించినట్లు సమాచారం. ఆలియా, రణబీర్ వివాహానికి హాజరైన అత్యంత విశ్వసనీయమైన అతిథితులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆలియా, రణబీర్ లు ఇద్దరూ అధికారికంగా భార్యాభర్తలయ్యారని, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశం అందించారు. రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ తన కొడుకు పెళ్లి చూసే లోకంలో లేకపోవడం విచారకరం. బాంద్రాలో జరిగిన వీరి పెళ్లికి నీతూకపూర్, రిద్దిమా కపూర్ సాహ్ని, కరీనాకపూర్, కరిష్మాకపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్ తదితులు హాజరయ్యారు.
ఇక రణబీర్-ఆలియా వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారిగా ఇవాళ రాత్రి 7గంటలకు మీడియా ముందుకు రానున్నారు. రణబీర్, ఆలియాల పెళ్లి ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. రణబీర్, ఆలియా పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్-ఆలియా మ్యారేజ్ రిసెప్షన్ ఎప్పుడనేది స్పష్టం తెలియనప్పటికీ..రెండు మూడు రోజుల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ రిసెప్షన్ కు రణబీర్ మాజీప్రియురాలు దీపికా, కత్రినా కైఫ్ హాజరుకానున్నారు.