Site icon HashtagU Telugu

Virata Parvam: ‘విరాట పర్వం’ విడుదల తేదీ ఫిక్స్!

Virataparvam

Virataparvam

 పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది.  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ల జోరు పెంచనుంది.  1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది. ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందించగా,  సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

Exit mobile version