నిన్నటి వరకు వైరా గులాబీ పార్టీ లో గందరగోళం నెలకొని ఉండే..సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu Naik ) ను కాదని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ( EX MLA Madan Lal)కు టికెట్ ఇచ్చారు. దీంతో రాములు అనుచర వర్గం అధిష్టానం ఫై గుర్రుగా ఉంది. ఎన్నికల్లో బిఆర్ఎస్ కు సపోర్ట్ చేసేదేలే..అన్నట్లు వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో అక్కడ ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రాములు నాయక్ ..సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మదన్ లాల్ గెలుపు కోసం పని చేస్తానని..త్వరలో నియోజక వర్గంలో కలిసి ప్రచారం చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు.
2018 ఎన్నికల్లో BRS తరపున మదన్ లాల్, ఇండిపెండెంట్‌గా రాములు నాయక్ పోటీ చేశారు. రాములు నాయక్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత రాములు నాయక్ BRSలో చేరారు. అప్పటి నుంచి..రాములు నాయక్,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వర్గాలుగా విడిపోయారు. ఒకే వేదికపై వీరు కలిసింది లేదు. విడిగా ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అధిష్ఠానం నుంచి ఎన్నిసార్లు చెప్పినా..నేతల తీరు మారలేదు. ఇక తీరా ఇప్పుడు ఎన్నికల సమయం రావడం తో ఎవరికీ వారే సీఎం వద్ద టికెట్ నాకు కావాలంటే..నాకు కావాలంటూ రిక్వెస్ట్ లు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం మదన్ లాల్ కు టికెట్ ఇచ్చి మిగతా ఇద్దరికీ షాక్ ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కి టికెట్ ఇవ్వడంతో.. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.
టికెట్ దక్కక పోవడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోకి వెళ్తారని కొంతమంది..లేదు లేదు కాంగ్రెస్ అభ్యర్ధికి సపోర్ట్ చేస్తారని మరికొంతమంది..అసలు ఈసారి రాజాకీయాలకే దూరం అవుతారని మరికొంతమంది..ఎలా ఎవరికీ వారే మాట్లాడుకుంటూ..ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ రాములు నాయక్ మాత్రం అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇటీవల మదన్ లాల్ నిర్వహించిన ర్యాలీలోనూ రాములు నాయక్ అనుచరులు, ఆయన వర్గీయులు అందరూ పాల్గొన్నారు
తాజాగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు వెళ్లడం.. ఇద్దరు భేటీ అవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయన నిర్ణయం, ఆదేశాల మేరకు పని చేస్తానని రాములు నాయక్ ప్రకటించారు.. నియోజకవర్గంలో BRS గెలవడం తమ లక్ష్యం అని తెలిపారు. త్వరలోనే కలిసి నియోజక వర్గంలో ప్రచారం చేస్తామని ప్రకటించారు. దీంతో వైరా లో గులాబీ గెలుపు ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.