Nara Lokesh: రామోజీరావు తనకు మెంటార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేశ్ అన్నారు. ఆయనది ప్రజల తరఫున ప్రశ్నించే గొంతు అని చెప్పారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ నంబర్ వన్‌గా నిలిచారని కొనియాడారు. రామోజీరావు తనకు మెంటార్‌గా ఉన్నారని, ఆయన సూచనల్ని జీవితాంతం పాటిస్తానని తెలిపారు.
అంతిమసంస్కారాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సుజనాచౌదరి, చింతమనేని ప్రభాకర్, పట్టాభి, వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు, బిఆర్ఎస్ ఎంపీ లు ఎంపీలు కె.ఆర్.సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ సంగీత సాహిత్య కళాకారుల సంఘం, దళితపక్షాల తరఫున సంగీతపు రాజలింగం రామోజీరావుకు గేయంతో నివాళి సమర్పించారు. ఆయనపై రాసిన గేయాన్ని పాడి వినిపించారు.