Site icon HashtagU Telugu

Hyderabad: వ్యభిచారం కేసులో రాంనగర్‌ పహిల్వాన్‌ అఖిల్‌ అరెస్టు

Akhil Pahilwan

Akhil Pahilwan

Hyderabad: హైదరాబాద్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నగరం ఒక వైపు అభివృద్ధి చెందుతున్నా మరోవైపు డ్రగ్స్, వ్యభిచారం, పబ్ కల్చర్ నగర ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల అమ్మాయిలను హైదరాబాద్ కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు కొందరు. తాజాగా అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

గత కొంతకాలంగా కోల్‌కతా నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఫార్చ్యూన్ లాడ్జిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మంది బాలికలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 ఫోన్లు, రికార్డులు స్వాధీనం చేసుకుని లాడ్జికి తాళం వేశారు. హోటల్ లో రూమ్స్ బుక్ చేసి అక్కడికి కస్టమర్లను రప్పించి గంటకు 3వేల నుంచి 5వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు యువతులతో పాటు యజమాని అఖిల్, మేనేజర్ రఘుపతిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న వారిలో ప్రధాన నిందితుడుగా అఖిల్ పహిల్వాన్ తో పాటు మరో ఏడుగురు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అఖిల్‌ పహిల్వాన్‌ ఫోన్‌ను చెక్‌ చేయగా అందులో పలు జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: Guntur Kaaram : OTT లో సందడి చేసేందుకు సిద్దమైన గుంటూరు కారం..