Site icon HashtagU Telugu

Ramcharan with BSF: బీఎస్ఎఫ్ జవాన్లకు చరణ్ స్పెషల్ ట్రీట్..!!

ramcharan

ramcharan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ RRRరాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఈ మధ్యే రిలీజై భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డుల్ని తిరగరాసింది. కాగా ఈ మూవీ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తరువాతి చిత్రాన్ని సంచలనాల దర్శకుడు శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే రాజమండ్రిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్టు షెడ్యూల్ గత కొన్ని రోజులుగా పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. అక్కడ షూటింగ్ చేస్తుండగా ఈ మధ్యే పంజాబ్ పోలీసులు సెట్లో సందడి చేశారు. రామ్ చరణ్ తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అమృత్ సర్ లో శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూవీ ఒకటి కీలక ఘట్టం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్లకు చరణ్ స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూవీ షూటింగ్ కు చిన్న విరామం దొరకడంతో చరణ్ అమృత్ సర్ సమీపంలోని ఖాసా సరిహద్దుకు వెళ్లారు.

అక్కడ విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో రామ్ చరణ్ ముచ్చటించారు. తర్వాత తన మూవీ కోసం తీసుకొచ్చిన హైదరాబాద్ చెఫ్ తో వారికోసం ప్రత్యేకంగా వంటలు చేయించాడు. ప్రత్యేక వంటలు చేయించి వారితో కలిసి భోజనం చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

Exit mobile version