రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో రామ్ ఒకరు. అయితే ఓ సినిమా షూట్ లో రామ్ కు గాయాలైన సంగతి తెలిసిందే. మెడనొప్పి కారణంగా కొన్ని నెలల పాటు ఇంట్లో గడపాల్సి వచ్చింది. వైద్యుల సూచన మేరకు షూటింగ్స్ దూరంగా ఉంటూ పూర్తిగా కొలుకున్నాడు. అయితే తమ అభిమాన హీరో కోలుకున్నారనే వార్త తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ సోమవారం ఇంటికి చేరుకున్నారు. ఆయన తో కొద్దిసేపు గడిపారు. రామ్ ఫొటోలతో కూడిన ‘న్యూ ఇయర్ క్యాలెండర్’ ను విడుదల చేసి సెల్ఫీలు దిగారు. అభిమానుల రాకతో రామ్ ఇళ్లు సందడిగా మారింది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన రామ్ త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. న్యూజోష్ తో సినిమాలు చేయనున్నాడు.
