ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సినిమా టిక్కెట్ల విషయం పై చర్చలు జరిపేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను కొందరు అమరావతిలోని సచివాలయానికి తీసుకెళ్లారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నాని ఇటీవల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఈ వివాదంపై చర్చించడానికి మంత్రి పేర్ని నాని రామ్ గోపాల్ వర్మ ను ఆహ్వానించిన నేపథ్యంలోనే ఆర్జీవీ అమరావతి వెళ్లారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువురూ చర్చించనున్నారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.