Site icon HashtagU Telugu

RGV: టాలీవుడ్ స్టార్ హీరోల పై.. ఆర్జీవీ షాకింగ్ క‌మెంట్స్

Rgv

Rgv

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, కొంద‌రు సినీ ప్ర‌ముఖులు గ‌త గురువారం, ఏపీ ముఖ్యంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌లు దాదాపు స‌ఫ‌లం అయిన‌ట్టే అని, వారంలో గుడ్‌న్యూస్ వింటార‌ని, జ‌గ‌న్‌తో భేజీ అయిన సినీ స్టార్స్ మీడియా ద్వారా తెలిపిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్‌కు మ‌ధ్య త‌లెత్తిన వివాదం తొల‌గిన‌ట్టే అని సినీ జ‌నాలు భావిస్తున్నారు.

అయితే జ‌గన్‌తో సినీ పెద్ద‌ల భేటీ అయిన‌ప్ప‌టి నుంచి మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో నిన్న చిరంజీవి అలా బెగ్గింగ్ చేయ‌డం న‌చ్చ‌లేద‌ని ఆర్జీవీ సెటైరిక‌ల్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం జ‌గ‌న్‌తో స‌మావేశం అయిన సినీ ప్ర‌ముఖులు అంద‌రి పై సెటైర్ వేశారు. జగన్ రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ అని, టాలీవుడ్ మెగా, సూప‌ర్, రెబ‌ల్ స్టార్లు అయిన చిరంజీవి మహేశ్ బాబు, ప్రభాస్‌ల‌తో పాటు తదితరులు ఒమేగా స్టార్ జగన్ చూట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవడమే అందుకు ఉదాహ‌ర‌ణ అని వ‌ర్మ ట్వీట్ చేశారు.

రీల్ లైప్‌లో చిరంజీవి, మహేశ్, ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారని, రియల్ లైఫ్‌లో మాత్రం జగన్ రియ‌ల్ స్టార్ అని ఆర్జీవీ అన్నారు. జగన్‌కు భయపడిని రీల్ స్టార్లు, భిక్ష కోసం ఆయ‌న‌ ముందు జూనియర్ ఆర్టిస్టుల్లా బెగ్గింగ్ చేశారన్నారు.ఇక మెగా, సూపర్, రెబ‌ల్ స్టార్స్‌తో పిల‌వ‌బ‌డే హీరోలను జీరోలుగా చేసిన, ఒమేగా స్టార్ జగన్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని రామ్ గోపాల్ వ‌ర్మ వ‌రుస‌గా ట్వీట్లు చేశారు. జ‌గ‌న్‌తో భేటీ ముగిన‌ప్ప‌టి నుంచి ఆ మీటింగ్‌లో పాల్గొన్న సినీ ప్ర‌ముల పై సెటైర్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో ఆర్జీవీ ర‌చ్చ చేస్తూనే ఉన్నాడు. మ‌రి వ‌ర్మ వ్యాఖ్య‌ల పై సినీ ప్ర‌ముఖుల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.