ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై ఆర్జీవీ అభ్యంతరకర ట్వీట్!

ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఈమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీకి అవకాశమిచ్చిన ఎన్డీఏ ఈ సారి ఎస్టీ మహిళకు అవకాశమిచ్చింది. దీంతో ద్రౌపది ముర్ము ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. వర్మ సంచలనాలకు పెట్టింది […]

Published By: HashtagU Telugu Desk
A3376bbe 01b2 4a36 B345 B91235866fd2

A3376bbe 01b2 4a36 B345 B91235866fd2

ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఈమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీకి అవకాశమిచ్చిన ఎన్డీఏ ఈ సారి ఎస్టీ మహిళకు అవకాశమిచ్చింది. దీంతో ద్రౌపది ముర్ము ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. వర్మ సంచలనాలకు పెట్టింది పేరు.

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తరచూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై కాంట్రవర్సీ వాఖ్యలు చేస్తూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై ఆర్జివి అభ్యంతరకరమైన పోస్టు ను పెట్టాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వర్మ ద్రౌపదీ ముర్ముని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

 

ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఇదే విషయం గిరిజనులు స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  Last Updated: 23 Jun 2022, 08:10 PM IST