Klin Kaara Konidela: మెగా ప్రిన్సెస్ ‘క్లిన్ కారా కొణిదెల’

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన పాపకి ఈ రోజు నామకరణం చేశారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభంగా నామకరణ వేడుక జరిగింది

Klin Kaara Konidela: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన పాపకి ఈ రోజు నామకరణం చేశారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభంగా నామకరణ వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు పేరుని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి పేరు ‘క్లిన్ కారా కొణిదెల’. ఈ విషయాన్ని తాతయ్య చిరు ప్రకటించారు.

లలితా సహస్రనామ నామం నుండి ఈ పేరును పెట్టినట్టు చిరంజీవి తెలిపారు. ‘క్లిన్ కార’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందన్నారు. చాలా శక్తిగలదని అర్ధం వస్తుందని చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Read More: Space Tour: విజయవంతం అయినా తొలి వాణిజ్య యాత్ర.. అంతరిక్షంలోకి ప్రయాణికులు?