Site icon HashtagU Telugu

Ramcharan: పంజాబ్ పోలీసులతో రామ్ చరణ్…వైరల్ అవుతోన్న ఫోటోలు..!!

Ram Charan

Ram Charan

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC15సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ముంబై, పుణెలో రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ పూర్తయ్యాయి. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ పంజాబ్ లో ప్రారంభమైంది. షూటింగ్ లొకేషన్ నుంచి రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ పంజాబ్ పోలీసులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించి ముఖ్యమైన సీన్ చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఈ మూవీ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.