మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ కు RRR సూపర్ హిట్ కావడం భలే కలిసి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా చెర్రీ, తారక్ కలిసి దేశమంతా చుట్టేశారు. దీంతో చెర్రీకి ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అటు కేంద్ర మంత్రులు మొదలుకొని, బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం RRR సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు ఇఛ్చిన నేపథ్యంలో దేశమంతా చెర్రీ, తారక్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇకపై చెర్రీ చేసే సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని తీయాల్సి ఉంటుంది. అయితే రాంచరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు.. RRR సినిమా కంప్లీట్ అవగానే తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య చిత్రం కూడా వేగంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేశాడు. అలాగే ఇక భారీ చిత్రాల దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న RC15 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
RC15 సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చాలా భాగం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్‌సర్‌లో చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్ ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో కాలేజ్ సీన్లు, ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు. అయితే ఈ సందర్భంగా అమృత్ సర్ లో రాంచరణ్ ను చూసేందుకు పంజాబీ యువత ఎక్కువగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
RRR సినిమా సాధించిన విజయం ద్వారా వచ్చిన క్రేజ్ ను చెర్రీ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జంజీర్ లాంటి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, చెర్రీకి ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, చెర్రీ నటించిన పలు తెలుగు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్బింగ్ వర్షన్ లకు మంచి వ్యూస్ వచ్చాయి. ఎవడు, ధ్రువ లాంటి సినిమా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో 500 మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇక తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తీసిన RRR బంపర్ హిట్ కావడంతో చెర్రీకి ప్యాన్ ఇండియా ఇమేజ్ సాధ్యం అయ్యింది. ఇక తాజా చిత్రం RC15 కార్తీక్ సుబ్బరాజు రాసిన పొలిటికల్ డ్రామా కథను రాంచరణ్‌తో సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
#RamCharan surrounded by his fans on #RC15 shoot location in Amritsar Punjab India. pic.twitter.com/djirlcKha7
— Ujjwal Reddy (@HumanTsunaMEE) April 18, 2022
