Golden Sweet for Raksha Bandhan: రాఖీ పండుగ కోసం ప్యూర్ గోల్డ్ స్వీట్ తయారీ.. ఎక్కడో తెలుసా?

భారతీయులు ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకునే వాటిలో రాఖీ పూర్ణిమ పండుగ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 07:30 AM IST

భారతీయులు ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకునే వాటిలో రాఖీ పూర్ణిమ పండుగ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కుల మతాలతో సంబంధం లేకుండా ఈ రాఖీ పూర్ణిమ పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రాఖీ పూర్ణిమ పండుగను అత్యంత ఘనంగా రాజస్థాన్ లో జరుపుకుంటారు. రాజ్ పుత్ సైనికులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వారి సోదరీమణులు వారికి రాఖీలు కట్టి పంపేవారు. అలా ఆ రాఖి వారికి విజయం అందిస్తుంది అని వారు భావించేవారు. ఆ విధంగా చారిత్రక అంశలతో మురిపడిన ఈ పండుగనాడు రాజస్థాన్ మహిళలు ఘవర్ అనే స్వీట్ తయారు చేసేవారు.

రాఖీ తో పాటు ఈ స్వీట్ ని కూడా సోదరులకు పెట్టేవారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా తయారు చేసే ఈ స్వీట్ కీ దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ స్వీట్ ని పిండి, నెయ్యి, షుగర్ సిరప్ తో కలిసి తయారు చేస్తారు. ఈ స్వీట్ ని ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రజలు స్వీకరిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ స్వీట్ కేజీ ధర మార్కెట్లో 600 రూపాయలు నుంచి 800 దాకా ఉంటుంది. ఒకవేళ ఆ స్వీట్ కి రకరకాల పండ్లు అలాగే డ్రై ఫ్రూట్స్ వంటివి జత చేస్తే దాని ద్వారా మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ తాజాగా ఆగ్రాలో ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా ఈ ఘగ్ స్వీట్ ను ఇదేకంగా బంగారంతో తయారు చేశారు. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో తయారు చేసిన ఈ స్వీట్ కేజీ ధర రూ. 25 వేలు. అయితే ఈ స్వీట్ మొత్తం బంగారం ఉండదు. కేవలం స్వీట్ పైన పూత లాగా బంగారం ఉంటుంది.

 

అయితే ఇది తినే బంగారం కాబట్టి ఈ స్వీట్ తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అంతేకాకుండా ఆ బంగారం తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే నట. ఆగ్రాలోని షా మార్కెట్ దగ్గరలో ఉన్న ఈ స్వీట్ షాప్ పేరు బ్రజ్ రసయన్ మిట్టన్ భండార్. ప్రస్తుతం ఈ స్వీట్ ను కొనేందుకు ఆగ్రా ప్రజలు తరలి వస్తున్నారు. కాగా ఈ స్వీట్స్ లో డ్రై ఫ్రూట్స్ అయినా పిస్తా, బాదం, వేరుశనగలు, వాల్నట్స్, వంటి వాటిని ఉపయోగించి బంగారం పూత పూసి, స్వీట్ పైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తో మలాయ్ కూడా ఉంటుంది అని షాప్ ఓనర్ తుషార్ గుప్తా చెప్పుకొచ్చారు. ఈ స్వీట్ ని ఒక రెడ్ కలర్ బాక్సులో ప్యాక్ చేసి ఇస్తున్నారు. అయితే రెడ్ కలర్ బాక్స్ ఎంచుకోవడానికి కూడా కారణం ఉందట. రెడ్ కలర్ శుభానికి సూచిక కాబట్టి ఆ కలర్ బాక్స్ ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.