Site icon HashtagU Telugu

Rakhi Sawant Arrested: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ అరెస్ట్

Rakhi Sawant

Resizeimagesize (1280 X 720) (3)

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ ను పోలీసులు అరెస్ట్ (Rakhi Sawant Arrested) చేశారు. తన అనుచితమైన వీడియోలు, ఫోటోలను వైరల్ చేసిందంటూ ఓ మహిళా మోడల్ ఫిర్యాదు చేయడంతో ముంబైలోని అంబోలీ పోలీసులు రాఖీసావంత్ ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం రాఖీసావంత్ ను అంబోలి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, రాఖీ సావంత్ ఆదిల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ముంబై పోలీసులు రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేశారు. షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. రాఖీ సావంత్ అరెస్ట్ విషయాన్ని షెర్లిన్ చోప్రా స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అభ్యంతరకర వీడియో కేసులో ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేశారని షెర్లిన్ చోప్రా ట్వీట్ చేసింది. షెర్లిన్ తన ట్విట్టర్ ఖాతాలో రాఖీని పోలీసులు అరెస్టు చేశారు. రాఖీపై దాఖలైన కేసు గురించి కూడా పేర్కొంది.

గతంలో షెర్లిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మోడల్‌కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను వైరల్ చేస్తానని రాఖీ బెదిరించినట్లు సమాచారం. రాఖీ సావంత్ ఇటీవల ఆదిల్ దురానీని పెళ్లాడింది. అప్పటి నుంచి ఆమె చర్చల్లోనే ఉంది. గురువారం ఆమె తన డ్యాన్స్ అకాడమీని ప్రారంభించబోతోంది. అయితే అంతకుముందు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.