Site icon HashtagU Telugu

Rajya Sabha Tribute: ల‌తాజీ మృతి ప‌ట్ల రాజ్యసభ నివాళి

Venkaiah Naidu

Venkaiah Naidu

ఈ రోజు ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. అనంతరం సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. తదననంతరం ఛైర్మన్ ప్రశ్నోత్తరాలను రద్దుచేస్తూ… సభను గంటపాటూ… వాయిదా వేశారు.  ల‌తాజీ మృతి ప‌ట్ల వెంక‌య్యనాయుడు తన సందేశంలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  దేశంలో భిన్నత్వం త‌ర‌హాలో ఆమె స్వరంలో కూడా ఆ శ‌క్తి ఉంద‌ని ఆయ‌న అన్నారు. సుమారు 25వేల పాట‌ల‌కు పైగా ఆమె రికార్డ్ చేశార‌ని, ఏడు ద‌శాబ్ధాల పాటు దేశంలో ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని ఆమె త‌న గ‌ళంలో వినిపించిన‌ట్లు తెలిపారు. 1999 నుంచి 2005 వ‌ర‌కు లతా మంగేష్కర్  రాజ్యస‌భ‌లో స‌భ్యురాలిగా ఉన్నారని,  ఆమె మృతితో ఓ లెజెండ‌రీ ప్లేబ్యాక్ సింగ‌ర్‌ను ఈ దేశం కోల్పోయిందన్నారు. గొప్ప మాన‌వ‌తామూర్తి అయిన ల‌తా మంగేష్కర్ ఎన్నో పలు అవార్డులను అందుకున్నారన్నారు.  ఇండియ‌న్ మ్యూజిక్‌లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంద‌న్నారు.