Site icon HashtagU Telugu

Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం!

Rajnath Singh

Rajnath Singh

ప్రస్తుతం అగ్నిపథ్ పతాకంపై దేశంలో యువత తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్లలో పెద్ద పెద్ద ఘర్షణలు కూడా జరగగా.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పు అంటించి భారీ నిరసన చేపట్టారు. అంతేకాకుండా ఆ ఘటనలో చాలా మందికి గాయాలు కాగా.. ఒకరు మరణించారు.

దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కాగా.. ప్రస్తుతం ఈ పథకంపై పలు చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ పై సర్వీస్ చీఫ్ లతో సమావేశం అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్, ఐఏఎస్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ తో చర్చిస్తున్నట్లు తెలిసింది.

అంతేకాకుండా అగ్నిపథ్ స్కీమ్, దేశవ్యాప్త ఆందోళన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పతాకంపై త్రివిధ దళాల్లో సైనిక నియమాల కోసం యువత ఆందోళన చేస్తుంది. రాజ్ నాథ్ సింగ్ ఈ పథకాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఆందోళన ఉద్రిక్తత ఎక్కువగా కావటంతో రాజ్ నాథ్ సింగ్ కీలక సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.