Site icon HashtagU Telugu

Rajinikanth : యూపీ సీఎం యోగి కాళ్లు మొక్కిన జైలర్

Rajinikanth Touches Yogi Adityanath's Feet

Rajinikanth Touches Yogi Adityanath's Feet

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) యూపీ సీఎం యోగి (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) కాళ్లు మొక్కడం ఇప్పుడు వైరల్ గా మారింది. రజనీకాంత్ అంటే కేవలం సౌత్ , నార్త్ ప్రేక్షకులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు. రజని నుండి సినిమా వస్తుందంటే చాలు భాష రానివారు సైతం థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేందుకు పోటీపడుతుంటారు. ఇక తమిళనాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజని సినిమా అంటే ఓ పెద్ద పండగల భావిస్తారు. ఇలా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయనను మరింతగా ప్రజల గుండెల్లో గుడి కట్టేలా చేసింది. అలాంటి రజని తాజాగా..యూపీ సీఎం యోగి కాళ్లు మొక్కడం చర్చ గా మారింది.

రీసెంట్ గా రజనీకాంత్ జైలర్ (Rajinikanth Jailer) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే రజనీకాంత్..ఉత్తర భారత్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. లక్నో (Lucknow)లో యూపీ సీఎం ఇంటి ముందు ఇలా కారు దిగగానే… తనకు స్వాగతం పలకడానికి వచ్చిన యోగి కాళ్లకు వినమ్రంగా నమస్కరించారు.

సీఎం యోగి, రజనీని లేపే ప్రయత్నం చేసేలోగా సూపర్ స్టార్ ఆయన పాదాలకు నమస్కరం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. యోగి వయసు 51 ఏళ్లు కాగా, రజని వయసు 72 ఏళ్లు. తనకన్నా చిన్న వాడైనా యోగి కళ్ళు మొక్కడం వెనుక.. యోగిలో గోరక్ పూర్ మాజీ పీఠాధిపతిని చూసుకున్నారు… అందుకే భక్తి భావంతో ఆయన పాదాలకు రజనీకాంత్ నమస్కరించి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సీఎం యోగి ఆహ్వానం మేరకు రాత్రి లక్నోలోని ఆయన నివాసానికి రజనీకాంత్ వెళ్లగా సాదర స్వాగతం పలికారు. కొన్ని ఆధ్యాత్మిక అంశాలపై వీరు చర్చించనట్లు తెలుస్తోంది.

Read Also : Jabardasth : ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్