Rajinikanth – Governor : తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్..?

ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న రజనీకాంత్‌ను

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 10:03 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) కు కేంద్రం కీలక పదవి అప్పజెప్పబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. చిత్రసీమలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్..72 ఏళ్ల వయసులోనూ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డ్స్ నెలకొల్పుతూ తన సత్తా చాటుతున్నారు. ఆ మధ్య రాజకీయాల్లోకి ఎంట్రీ (Political Entry) ఇవ్వాలని అనుకున్నప్పటికీ..ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే అవసరం లేదని డిసైడ్ అయ్యిన రజని..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా జైలర్ (Jailer ) తో భారీ హిట్ అందుకున్నారు. ఈ తరుణంలో కేంద్ర బిజెపి రజనికి మెగా పదవి ఇచ్చేందుకు సిద్దమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా రజనీని నియమించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న రజనీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌ (Telangana Governor)గా పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రజనీకి గవర్నర్ గిరి కట్టబెట్టడం ద్వారా దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపేతానికి ఆయన చరిష్మా కలిసి వస్తుందని అగ్రనాయకత్వం భావిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also : Famous Temples Of Lord Krishna : శ్రీ కృష్ణుడి ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం రండి..

ర‌జనీకి గవర్నర్‌ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు (Rajinikanth Brother Sathyanarayana Rao) అన్నారు. ర‌జనీ సైతం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని తిర‌స్క‌రించ‌ర‌ని అన్నారు. సూపర్ స్టార్ ఇటీవ‌ల ప‌లువురు బీజేపీ రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌డం, ఆయన సోదరుడి వ్యాఖ్య‌లు రజనీకి గవర్నర్ గిరి అనే ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బీజేపీ హయాంలోనే రజనీకాంత్ కు భారతీయ సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్ దక్కిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.