Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన సినిమాల మీద ఎంతో ఆశలు పెట్టుకుంటారు. ఇటీవల విడుదలైన జైలర్ సినిమా రజినీ మాస్ స్టామినాను మరోసారి నిరూపించింది. గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాకపోవడంతో రజినీ సినిమాలకు గుడ్‌బై చెప్పవచ్చు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన జైలర్ సినిమా ఆ కామెంట్లను తిప్పికొట్టింది. మిడిల్ ఏజ్ లుక్‌లోనే రజినీ యాక్షన్ సీన్స్ అభిమానులకు బూస్ట్ ఇచ్చాయి. ఈ హిట్‌తో రజినీ తిరిగి ఫామ్‌లోకి వచ్చి, ఈ ఏడాది వేట్టయ్యన్ సినిమాతో ఆకట్టుకున్నారు.
Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్
ప్రస్తుతం రజినీ, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో కూలీ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత జైలర్ 2 పై ఫోకస్ పెడుతున్నారు. సూపర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ సీక్వెల్‌ను అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రంలో యాక్షన్ సీన్స్‌కు వచ్చిన క్రేజ్‌ను మించి, జైలర్ 2లో మరింత పవర్‌ఫుల్ ఫైట్లు ఉండబోతున్నాయని డైరెక్టర్ నెల్సన్ ధృడంగా చెబుతున్నారు.
గ్లామర్ పరంగానూ జైలర్ 2 ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని కీలక పాత్రలో తీసుకున్నారు. కేజీఎఫ్ 1 & 2 చిత్రాల తరువాత శ్రీనిధి కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కోలీవుడ్‌లో రజినీతో కలిసి జైలర్ 2 చేయడం ఆమెకు మరో కీలక అవకాశం. ఆమెతో పాటు తమన్నా కూడా ఈ సినిమాలో కనిపించనుందనే వార్తలొస్తున్నాయి.
అందుకు తగ్గట్టే జైలర్ 2 యాక్షన్, గ్లామర్ అంశాలు పూర్తిగా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. సూపర్ హిట్ ఫ్రాంచైజీలో భాగం కావడం శ్రీనిధి , చిత్ర బృందానికి తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చు. జైలర్ 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది, సినిమా విడుదల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Loan App Harassment : యువతి న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు.. ఇద్దరు అరెస్ట్..