Tirumala : తిరుమల శ్రీవారి సేవలో రజినీకాంత్..!

అగ్ర నటుడు రజనీకాంత్ (Rajinikanth) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tirumala Rajinikanth

Ttd Rajini

అగ్ర నటుడు రజనీకాంత్ (Rajinikanth) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 12న రజనీకాంత్ 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రముఖుల నుంచి ఆశీస్సులు అందుకున్నారు. అయితే ఆ రోజు కాకుండా బుధవారం (14న) సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలసి రజనీకాంత్ (Rajinikanth) తిరుమలకు (Tirumala) వచ్చారు. టీటీడీ (TTD) అధికారులు రజనీకాంత్, ఆయన కుమార్తె దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు.

ఈరోజు ఉదయం రజనీకాంత్, ఐశ్వర్య స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ వెళ్లారు. దర్గా దర్శనానికి ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. రజనీకాంత్ కొత్త చిత్రం ‘లాల్ సలామ్’ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది.

Also Read:  Bejawada : దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభం..

  Last Updated: 15 Dec 2022, 01:59 PM IST