ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ను ఇటీవల బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్‌కు ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు.
అయితే సవాంగ్ ఆ పోస్టులో ఉండాలంటే, తన సర్వీస్‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరో ఏడాదిన్నర పాటు గౌతం సవాంగ్‌కు సర్వీసు ఉన్న నేపధ్యంలో, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తారా లేనదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే కడప జిల్లాకు చెందిన రాజేంద్ర నాధ్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్‌కి డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటలిజెన్స్ చీఫ్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేంద్రనాథ్ ఇప్పుడు ఏపీ పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.