Site icon HashtagU Telugu

Marriage Letter: ఇదేందయ్యా ఇది.. అమ్మాయి కావాలంటూ ఏకంగా ప్రభుత్వానికి లేఖ?

Marriage Letter

Marriage Letter

సాధారణంగా పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనిపించడం సర్వసాధారణం. పెళ్లి వయసు వచ్చిన తర్వాత మనకు తగ్గ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా అని తెలిసిన వాళ్ళని, బ్రోకర్లను అడుగుతూ ఉంటాం. అలా అబ్బాయిల కోసం అమ్మాయిలు, అమ్మాయిల కోసం అబ్బాయిలను వెతుకుతూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో మ్యారేజ్ వెబ్సైట్లు చాలానే అందుబాటులోకి రావడంతో చాలామంది ఈ వెబ్సైట్ ల ద్వారా వధువు వరులను వెతుక్కుంటున్నారు. అయినప్పటికీ అమ్మాయి దొరకకపోతే చేసేది ఏమీ లేక మౌనంగా ఉండటమే.

అని ఒక వ్యక్తి మాత్రం తనకు అమ్మాయి దొరకడం లేదని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక వ్యక్తి తనకు అమ్మాయి దొరకడం లేదని ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాశాడు. వినడానికి ఆశ్చర్యంగా విడ్డూరంగా ఫన్నీగా ఉన్నా ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని దుబ్బి గంగద్ వాడి గ్రామానికి చెందిన మహావార్ అనే వ్యక్తికి 40 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సమస్యల కారణంగా అతనికి పెళ్లి కాలేదు. అయితే కొంతకాలం నుంచి అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించారు. అయినప్పటికీ అతనికి తగ్గ వయసు అమ్మాయి మాత్రం దొరకడం లేదు. ఇక పెళ్లి చూపులకు వెళ్లినా కూడా వయసు ఎక్కువ ఉండడంతో చాలామంది అమ్మాయిలు అతని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో విసుకు చెందిన మహవర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి ఒక లేఖ రాశాడు. సార్.. పెళ్లికి పిల్ల దొరకడం లేదు. దయచేసి ఒక పిల్లను వెతికి పెట్టండి మహాప్రభో అంటూ లేఖలో వేడుకున్నాడు. అంతే కాదండోయ్ ఆ పెళ్ళికొడుకు నాలుగు రకాల కండిషన్లు కూడా పెట్టాడు. అమ్మాయి సన్నగా ఉండాలని, చూడ్డానికి అందంగా ఉండాలని, న్యాయకత్వ లక్షణాలు తప్పకుండా ఉండాలని, అమ్మాయి వయసు 30 నుంచి 40 మధ్యలో ఉండాలంటూ కండిషన్లు కూడా పెట్టాడు. ఆ లేక చూసి అవాక్ అయిన అధికారులు అందుకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

Exit mobile version