SRH: సన్ రైజర్స్ బోణీ కొడుతుందా ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఐదో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 06:20 AM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఐదో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌ కాకావడంతో , గెలుపు కోసం ఇరు జట్లు ఉవ్విళూరుతున్నాయి.. ఇక రికార్డుల పరంగా చూస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు మొత్తం 15 మ్యాచ్‌ల్లో తలపడగా హైదరాబాద్ జట్టు 8 మ్యాచుల్లో, రాజస్థాన్ జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఇక ఇరు జట్ల మధ్య చివరగా గతేడాది దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగ్గా అందులో విలియంసన్ సేన.. రాజస్థాన్ రాయల్స్ పై పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని సంజూ శాంసన్ సేన భావిస్తుంది.
ఇక ఈ మ్యాచ్ లో కేన్ విలియంసన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుని పరిశీలిస్తే.. కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో , రాహుల్ త్రిపాఠి, మిడిల్ ఆర్డర్ లో ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ లోయర్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇకసన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విషయానికొస్తే..మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, శ్రేయాస్ గోపాల్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..

అలాగే ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ కెప్టెన్సీ లోని రాజస్థాన్ రాయల్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ ,మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ లోయర్ ఆర్డర్ లో రియాన్ పరాగ్, రవి అశ్విన్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. ఒబెద్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

అలాగే ఈ మ్యాచ్ జరగనున్న ఎంసీఏ పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అయితే బంతి పాత పడ్డాక స్పిన్నర్లకు సహకరిస్తుంది. రికార్డుల ప్రకారం,ఎంసీఏ పిచ్ మీద ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాన్ని సాధించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బలహీనంగా కనిపిస్తుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.