టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి సెలవుపై వెళ్లనున్నారు. ఆయన భార్య అనారోగ్య కారణంతో సెలవులో ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే చంద్రబాబు అదే జైల్‌లో రిమాండ్ లో ఉన్న సమయంలో సూపరింటెండెంట్ సెలవులపై వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. ఓ వైపు చంద్రబాబు కుటుంబసభ్యులు, ఆయన తరుపు న్యాయవాదులు, టీడీపీ నేతలు జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడంతో టీడీపీ నేతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh : రేపటి నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్.. కారణం ఇదే..?

Superintendent Of Rajahmundry Jail Who Went On Leave