Site icon HashtagU Telugu

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరుకుంటారా

Rajagopal Reddy

Rajagopal Reddy

Rajagopal Reddy: కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. అయితే, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన రాజ‌గోపాల్ రెడ్డి అందులో భాగంగానే ప్ర‌ధాని స‌భ‌ను లైట్ తీసుకున్నార‌ని చెప్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు సైతం ఈ విష‌యాన్ని రూడీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్రధాని మోడీ సభకు బీజేపీలో ఉన్నప్ప‌టికీ రాజగోపాల్‌ రెడ్డి వెళ్లక‌పోవ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వ‌స్తున్న సిగ్న‌ల్స్ అని చెప్తున్నారు. బీజేపీలో త‌న‌కు భవిష్యత్తు లేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావిస్తున్న‌ట్లు స‌మాచారం.