Site icon HashtagU Telugu

Raja Singh’s lawyer: రాజాసింగ్ న్యాయవాదిపై మతోన్మాది దాడి

Rajasing

Rajasing

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత.. ఆయన తరపు న్యాయవాది కరుణ సాగర్ కాశీంశెట్టిపై నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు బయట గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. “కోర్టు 4వ గేట్ వెలుపల నేను మీడియాను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ‘‘ఓ మతోన్మాదుడు అసంబద్ధమైన విషయాలపై అరుస్తూ నాపై దాడికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు అతన్ని అడ్డుకున్నారు. చర్య తీసుకోవాలని మేం పోలీసులకు చెప్పాము. కానీ వారు తీసుకోలేదు”అని లాయర్ చెప్పారు.

కాశీంశెట్టి ఇటీవల కూడా తనకు ఫోన్ ద్వారా చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని ట్వీట్ చేశాడు. “కొంతమంది కాల్ చేసారు. ‘మీరు రాజా సింగ్ కేసును వాదిస్తున్నారు. కాబట్టి నిన్ను చంపుతాము.” బెదిరించాడని ఆయన తెలిపారు. బెదిరింపులు తనను అడ్డుకోలేవని ట్విట్టర్‌లో  స్పందించాడు కాశీంశెట్టి లాయర్. ద్వేషపూరిత ప్రసంగం-సంబంధిత కేసుల్లో ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బిజెపి ఎమ్మెల్యేకు షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు.

Exit mobile version