Site icon HashtagU Telugu

MLA Raja Singh:జూబ్లీహిల్స్ అత్యాచార నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలి..!!

Raja Singh

Raja Singh

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు ఇంకెన్నో దారుణాలకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మా నాన్న టీఆరెస్, ఎంఐఎం పార్టీల్లో ఉంటే మేము సేఫ్ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని రాజాసింగ్ ఆరోపించారు. మేము చేసిందే రాజ్యం, మేము చెప్పిందే వేదమని సీఎం కేసీఆర్, ఇతర నేతలు భావిస్తున్నారని రాజా సింగ్ అన్నారు.

కాగా జూబ్లీహిల్స్ ఘటన నుంచి తేరుకోకముందే…మొఘల్ పురలో మరో మైనర్ ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని…ఇదంతా టీఆరెస్ నేతల వల్లే తెలంగాణ గడ్డ రేప్ ల గడ్డగా మారిందని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడ్డాక…నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రితో సహా హోంమంత్రి డప్పులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ఒక్కసారి ఫాంహౌజ్ నుంచి బయటకు వచ్చి చూడండి…తెలంగాణలో అత్యాచారాలు, హత్యలు, క్రైమ్ రేటు పెరిగిందన్నారు. క్రైం రేటు తగ్గింపుపై చర్యలు తీసుకోకుంటే..ప్రజలే గద్దె దింపేస్తారని రాజాసింగ్ హెచ్చరించారు.

Exit mobile version