Rain Alert Today : మూడు రోజులు వర్షాలు.. తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్

Rain Alert Today : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 08:54 AM IST

Rain Alert Today : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో రాయలసీమలోని సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య​, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు ఉండనున్నాయి. కానీ రాత్రికి బెంగళూరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంకాలం మారేడుమిల్లి – రంపచోడవరం – పోలవరం – యేలేశ్వరం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలను చూడగలం. ఇక రాయలసీమలో రేపు, ఎల్లుండి చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉంది.

Also read : Important Guidelines: నేటి నుంచే ఎస్ఎస్సీ MTS పరీక్ష.. ఇవి మర్చిపోకండి..!

సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని (Rain Alert Today) వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై కనిపించనుంది. నగరంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

Also read : One Nation One Election : మినీ జమిలి ఎన్నికలకు సన్నాహాలు ? స్పెషల్ పార్లమెంట్ సెషన్ అందుకోసమేనా ?