Rain Alert: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌.. మరో 4 రోజులపాటు భారీ వ‌ర్షాలు

తెలంగాణ‌లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బడింది. హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:28 PM IST

తెలంగాణ‌లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బడింది. హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేగంపేటలో 63.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని హైద‌రాబాద్‌లోని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున రాబోయే 4 రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు హైద‌రాబాద్‌లోని వాతావ‌ర‌ణ‌కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు కురిసే అవకాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలు, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం త‌డిసిపోయాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేస్తోంది. అయితే హైదరాబాద్‌కు తెల్లవారుజాము నుంచే జోరుగా వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసింది. ఉదయం 6 గంటల వరకు సీతాఫల్‌మండిలో అత్యధికంగా 72.8 మి.మీ, బన్సీలాల్‌పేటలో 67 మి.మీ వర్షం కురిసింది. వెస్ట్ మారేడుపల్లి (61.8 మి.మీ), అల్వాల్ (59.3 మి.మీ), బాలానగర్ (54.3 మి.మీ)లలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. వర్షపు నీటితో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.