Rains In Telangana : తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు..?

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు వర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ రోజు, రేపు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Rains

Rains

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు వర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ రోజు, రేపు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని పేర్కొంది. ఈ రోజు కొమ‌రంభీంఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఐఎండీ తెలిపింది.

రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  Last Updated: 17 Jul 2022, 10:47 AM IST