Site icon HashtagU Telugu

Rainbow: వావ్.. ఆకాశంలో అద్భుతం.. కిరీట హరివిల్లు ఫోటోలు.. అలా ఎందుకు ఏర్పడుతుందంటే?

Rainbow

Rainbow

సాధారణంగా అప్పుడప్పుడు ఆకాశంలో రకరకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అనగా ఇంద్రధనస్సు ఏర్పడడం, అలాగే మేఘాలు దేవుడి రూపంలో లేని పక్షుల రూపంలో కనిపించడం, ఇలా అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువగా వర్షం పడే సమయంలో ఏర్పడే ఇంద్రధనస్సు ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళితే ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ దృశ్యం చైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బుల కిరీటం.

కాగా ఆకాశంలో ప్రకృతి చేసిన ఈ చిత్ర విచిత్రం నెటిజన్స్ ని ఎంతగానో అబ్బురపరించింది. అంతే కాకుండా నెటిజన్స్ కూడా మబ్బుల కిరీటాన్ని చూడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మబ్బుల కిరీటం పై స్పందించిన శాస్త్రవేత్తలు..మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని వెల్లడించారు.

 

కాగా ఈ తరహా మబ్బులను పిలియస్, క్యాప్‌ క్లౌడ్స్‌ లేదా స్కార్ఫ్‌ క్లౌడ్స్‌గా పిలుస్తారని శాస్త్రవేత్తలు చూపుకొచ్చారు. ఒక ప్రాంతం పై క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే క్రమంలో వాటి చుట్టూ ఉండే గాలి వేగంగా మరింత ఎత్తుకు చేరుకున్నాక తరువాత అందులో ఉన్న నీరు ఘనీభవించి గొడుగు ఆకారంలో ఈ విధంగా మబ్బులు ఏర్పడతాయి అని తెలిపారు. అలాగే వాతావరణం తీవ్రంగా మారుతోందనేందుకు ఈ తరహా మేఘాలు సంకేతమని వారు తెలిపారు.