Heat Stroke: ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. వడదెబ్బ కారణంగా 54 మంది మృతి

రళలో రుతుపవనాలు ప్రవేశించగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Heat Stroke) పెరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 31, 2024 / 11:52 AM IST

Heat Stroke: ఉత్తర భారతంలో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది.దీంతో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. కేరళలో రుతుపవనాలు ప్రవేశించగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Heat Stroke) పెరుగుతున్నాయి. ఇప్పుడు విపరీతమైన వేడి ప్రాణాంతకంగా మారింది. వడదెబ్బ కారణంగా 4 రాష్ట్రాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా, నాగ్‌పూర్‌లలో ఈ మరణాలు సంభవించాయి.

గురువారం ఒడిశాలో 7 గంటల్లో 6 మంది మహిళలతో సహా 10 మంది మృత్యువాత పడగా, గత 24 గంటల్లో బీహార్‌లో వేడిగాలులు 21 మంది ప్రాణాలను బలిగొన్నాయి. జార్ఖండ్‌లో గత 36 గంటల్లో ముగ్గురు చనిపోగా, నాగ్‌పూర్‌లో మే 24 నుండి మే 30 మధ్య 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు మరణించారు.

ఒడిశాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు

ఒడిశాలోని అన్ని మరణాలు గురువారం మధ్యాహ్నం 1.30 నుండి రాత్రి 8.40 గంటల మధ్య రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించాయి. ఇక్కడ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరణించిన వ్యక్తుల వయస్సు 23 నుండి 70 సంవత్సరాల మధ్య.. 6 మంది మహిళలు 30 నుండి 69 సంవత్సరాల మధ్య ఉన్నారు. దీనికి సంబంధించి RGH డైరెక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ.. మరణానికి కారణం హీట్ స్ట్రోక్ కావచ్చు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే సరైన సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Also Read: Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?

ఔరంగాబాద్‌లో 12 మంది చనిపోయారు

బీహార్‌లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 47.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఔరంగాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 20 మంది చేరారని, వారిలో 12 మంది వడదెబ్బ కారణంగా మరణించారని ఔరంగాబాద్ ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, భోజ్‌పూర్, బక్సర్, రోహ్తాస్, అర్వాల్, బెగుసరాయ్, పాట్నాలో 9 మంది మరణించారు.

We’re now on WhatsApp : Click to Join

భోజ్‌పూర్‌లో ముగ్గురు పోలింగ్ కార్మికులు మరణించారు

భోజ్‌పూర్‌లో వడదెబ్బ కారణంగా ముగ్గురు పోలింగ్ కార్మికులు సంజయ్ కుమార్, రాజేష్ రామ్, మహ్మద్ యాసిన్, హోంగార్డు జవాన్ హేమ్ నారాయణ్ సింగ్ మరణించారని భోజ్‌పూర్ డీఎం మహేంద్ర కుమార్ తెలిపారు. హోంగార్డు జవాన్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.