Tamilnadu : త‌మిళ‌నాడు పాఠ‌శాల‌ల‌కు సెల‌వు

తమిళనాడులో మరో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది.

  • Written By:
  • Updated On - November 23, 2022 / 12:37 PM IST

తమిళనాడులో మరో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తమిళనాడులోని రాణిపేట జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం వైపు వెళ్లి మరింతగా అల్పపీడనంగా మారిందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధిపతి ఎస్ బాలచంద్రన్ ప్ర‌క‌టించారు. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం ఉందని ఆర్‌ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరిలలో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. భారీ వర్షాలు కార‌ణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ముందుజాగ్రత్తగా రాణిపేట జిల్లాలోని పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించారు.