Site icon HashtagU Telugu

Rain Forecast : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే చాన్స్

Hyderabad

Hyderabad

Rain Forecast : గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వర్షాలు కొంచెం గ్యాప్ ఇచ్చాయి. కానీ.. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఈశాన్య రుతుపవనాలు, తూర్పు గాలుల ప్రభావంతో కురిశాయి. కానీ.. వచ్చే నాలుగు రోజులు కురవబోయే వర్షాలు బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడనున్న అల్పపీడనం వల్ల రానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.