TTD: తిరుపతిపై తుఫాన్ ఎఫెక్ట్, టీటీడీ అధికారులు అలర్ట్

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 04:29 PM IST

TTD: మిచౌంగ్  తీవ్ర తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా తిరుపతి నగరం పలుచోట్ల ముంపునకుగురైంది. జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు కాళంగి, మల్లెమడుగు, అరణియార్, కళ్యాణిడ్యాంలు నీటితో నిండిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలుగు రిజర్వాయర్లకు సంబంధించిన గేట్లను ఎత్తివేశారు. అలాగే తిరుమలలోని 5 జలాశయాలు కూడా నిండాయి. దీంతో టిటిడి అధికారులు గోగర్బ డ్యాం, పాపవినాశనం డ్యాం, ఆకాశగంగ, కుమారధార-పసుపుధార డ్యాంల గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

మిచౌంగ్  తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల వరద నీరు పోటెత్తడంతో పంబలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుతుండడంతో పది గేట్లను ఎత్తివేసి 15వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.