Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra : నేడు వర్షం కారణంగా ఆల‌స్య‌మైన భార‌త్ జోడో యాత్ర

Rahul Gandhi

Rahul Gandhi

కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఆలస్యమైంది. రాష్ట్రంలో రెండో రోజు పాదయాత్రకు గుండ్లుపేటలో కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం 6.30 గంటలకు చామరాజనగర్ జిల్లా తొండవాడి మీదుగా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బేగూర్ నుండి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడోయాత్ర 24వ రోజు వర్షం కారణంగా ఆలస్యమైంద‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 15 రోజుల విరామం తర్వాత వర్షాలు కురిశాయని తెలిపారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం తమిళనాడులోని గూడలూరు నుంచి కర్ణాటకలోని గుండ్లుపేటకు చేరుకున్నారు