Weather Updates : కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో వచ్చే రెండు రోజులు వర్షాలు – ఐఎండీ

ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు యూపీ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు […]

Published By: HashtagU Telugu Desk
Biparjoy

Rain

ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు యూపీ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కడప జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. విజయనగరం జిల్లాలో సోమవారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు గంటల పాటు ఈదురుగాలులు వీచడంతో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షం నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

  Last Updated: 07 Jun 2022, 09:59 AM IST