Site icon HashtagU Telugu

Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం

Delhi Rains

Delhi Rains

Delhi Rains: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వర్షం మొదలైంది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.

ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.40 రోజుల తర్వాత మొదటిసారిగా మెర్క్యురీ 40 డిగ్రీల కంటే దిగువకు పడిపోయింది. శనివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్, ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. అంతకుముందు మే 12న ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39.8 డిగ్రీల సెల్సియస్, 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ. మే 13 నుంచి వరుసగా 40 రోజుల పాటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉంది.

గత నెల రోజులుగా ఢిల్లీలో వేడిగాలులు, ఉక్కపోత కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. 11 గంటలు దాటినా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎండ వేడిమికి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు తొలకరి చినుకులు ఢిల్లీని పలకరించడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: KTR: CM అంటే కటింగ్ మాస్టరా?.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్!