Railways Fares Cut : ఆ టికెట్ల రేట్లు 25% తగ్గించిన రైల్వే

Railways Fares Cut  : రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది..

  • Written By:
  • Publish Date - July 8, 2023 / 04:48 PM IST

Railways Fares Cut  : రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది..

వందేభారత్‌ సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్‌ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లతో పాటు అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లలో ఆక్యుపెన్సీని బట్టి రైల్వే టికెట్లపై 25 శాతం వరకు రేట్లు తగ్గిస్తామని వెల్లడించింది. టికెట్ ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ లభిస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌ ఛార్జ్, జీఎస్టీ ఇతర ఛార్జీలు విడివిడిగా విధిస్తారని తెలిపింది. తక్షణమే ఈ రాయితీ స్కీం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. హాలిడే స్పెషల్ ట్రైన్స్, ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ లో ఈ పథకం వర్తించదని(Railways Fares Cut)  రైల్వే బోర్డు తేల్చి చెప్పింది.

Also read : Uniform Civil Code: UCC అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసినంత సులువు కాదు

రైళ్లలో ఏసీ సీటింగ్‌ కు సంబంధించిన టికెట్లపై రాయితీ పథకాలను ప్రవేశపెట్టే అధికారాలను రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సీట్ల లభ్యత ఆధారంగా రాయితీ స్కీంలకు  ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లు రూపకల్పన చేస్తారని రైల్వే బోర్డు తెలిపింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది.