Site icon HashtagU Telugu

Rahul Gandhi: చిన్నారి ఆటోగ్రాఫ్ తీసుకున్న రాహుల్: వైరల్ వీడియో

Rahul Gandhi

New Web Story Copy 2023 08 28t124625.370

Rahul Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ మధ్య ప్రజలతో మమేకమవుతున్నారు. జోడో యాత్ర తరువాత తనలో చాలా మార్పులు గమనించవచ్చి. అదంతా రాజకీయ పరమే అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారిని ఆటోగ్రాఫ్ అడిగి ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేశారు.

ప్రస్తుతం రాహులో ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మహిళ చాకోలెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. చాకొలేట్ తయారీ విధానం, వర్కర్స్ ఆర్ధిక పరిస్థితి, కంపెనీ ఇస్తున్న జీతభత్యాల గురించి ఆరా తీశారు. ఈ సమయంలో ఓ చిన్నారి రాహుల్ గాంధీ చెంతకు వచ్చి తన ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. దానికి రాహుల్ ఎంతో ముచ్చటపడి చిన్నారి ఇచ్చిన బుక్ లో తన సంతకం చేసి ఇస్తూ.. ఆ చిన్నారి ఆటోగ్రాఫ్ కూడా తనకు కావాలని అడిగాడు. దీంతో ఆ చిట్టితల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆ బుక్ లో పాప సంతకం చేసి రాహుల్ కు ఇచ్చింది. ఆ పేపర్ ని చించుకుని రాహుల్ తన జేబులో పెట్టుకున్నాడు. దాంతో అక్కడ పనిచేస్తున్న మహిళలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్ సాధారణ ప్రవర్తనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Read: Heart Attack : ఫ్లైట్‌లో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు..బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు

Exit mobile version