Rahul Gandhi: తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాల్సిందే.. తెలుగులో రాహుల్ ట్వీట్..

తెలంగాణ రైతుల సమస్యలపై ట్విటర్ వార్ కొనసాగుతోంది. రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Rahul

Rahul

తెలంగాణ రైతుల సమస్యలపై ట్విటర్ వార్ కొనసాగుతోంది. రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, ఆరెఎస్ ప్రభుత్వాల వైఖరిని రాహుల్ గాంధీ ఎండగట్టారు. తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ…రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతును క్షోభపెట్టే పనులు మానుకోవాలని రాహుల్ హితవు పలికారు.

పండించిన ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాల్సెందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ పండించిన చివరి గింజ కొనేవరకు రైతుల పక్షనా కాంగ్రెస్ కొట్లాడుతుందన్నారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ తన ఆగ్రహాన్నివ్యక్తంచేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో బీజేపీ, టీఆరెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ తెలుగులో ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. (#FightForTelanganaFarmers)

ఇక వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి రెడీ అయ్యింది. నెలరోజుల పాటు ఆందోళనలు నిర్వహించాని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ అంశంపై తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

  Last Updated: 29 Mar 2022, 11:44 AM IST