Site icon HashtagU Telugu

Politics: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

ఇటీవల అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిచారు. భారత దేశంలో 2014 తర్వాత ఇలాంటి మూకదాడులు జరుగుతున్నాయి అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 2014కు ముందు దేశం మూకదాడులు అనే పదం కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు. కాగా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బీజేపీని నేరుగా ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు.

మరో వైపు బ్రిటన్ తొలి మహిళా సిక్కు ఎంపీ ఈ ఘటన పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయంలో అపవిత్ర చర్యకు పాల్పడిన వ్యక్తిని హిందూ ఉగ్రవాదితో ఆమె పోల్చారు. ఈ ఘటనకు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నించడంతో ఆమె ఆ ట్వీట్ ను తొలగించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం అపవిత్ర చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను మూకదాడుల్లో కొట్టి చంపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో రాజకీయా కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.

Exit mobile version