Site icon HashtagU Telugu

Assembly Election Results 2022: అసెంబ్లీ ఫ‌లితాల పై రాహుల్ రియాక్ష‌న్..!

Rahul Gandhi Tweet

Rahul Gandhi Tweet

ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల ప‌లితాల కౌంటిగ్ ఈరోజు జ‌రుగున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గా, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌భంజనానికి బిత్త‌ర పోయిన కాంగ్రెస్ అక్క‌డ ప్ర‌స్తుతం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొన‌సాగుతుంది.

ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ జ‌రిగిద్ద‌ని అంద‌రూ భావించారు. అయితే ఎన్నిక‌ల ముందు చేసిన త‌ప్పుల కార‌ణంగా అక్క‌డ ఆప్ చేతిలో దారుణంగా ప‌రాజ‌యం పొందింది. అలాగే ఉత్త‌రాఖండ్‌లో 18 స్థానాలు, గోవాలో 12 స్థానాలు, మ‌ణిపూర్‌లో 11 స్థానాల్లో విజ‌యం సాధించిన కాంగ్రె, ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో చ‌తికిల‌ప‌డింది.

ఈ నేప‌ధ్యంలో తాజా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఊహించ‌ని విధంగా దారుణ ప‌లితాలు రావ‌డంతో, ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నిక‌ల ఓట‌మిని అంగీక‌రిస్తున్నామ‌ని, ప్ర‌జ‌ల తీర్పును శిరసా వహిస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నుంచి పాఠాన్ని నేర్చుకుంటామని, ప్రజా సంబంధ అంశాలపై పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.