Rahul Gandhi : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని పేర్కొన్నారు. “ఈ ప్రమాదం హృదయవిదారకమైనది. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొంటున్న తీరని బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్లిష్ట సమయంలో వారికి నా ఆలోచనలు, సంఘీభావం ఉంటాయి” అని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Air India Plane Crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
“ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి క్షణం ముఖ్యమైనదే. కాబట్టి సహాయం ఆలస్యం కాకుండా చేరాలి” అని స్పష్టం చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. “ఇది బాధితులకు మానవతా దృక్పథంతో చేయూత ఇవ్వాల్సిన సమయం. ఈ దుస్థితిని మానవీయ కోణంలో చూసి ప్రతి ఒక్కరూ సహాయానికి ముందుకు రావాలి” అని అన్నారు. ప్రమాదానికి గురైన వారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించేలా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.
PAN-Aadhaar Card: పాన్-ఆధార్ కార్డు లింక్ చివరి తేదీ ఎప్పుడు? స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఇదే!