Site icon HashtagU Telugu

Rahul Gandhi: పరువు నష్టం కేసుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు రాహుల్

Another Setback For Rahul

Another Setback For Rahul

Rahul Gandhi: మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ పొలిటికల్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ న్యాయపరమైన చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో రాహుల్ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే రాహుల్ పై నమోదైన కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టు జులై 7న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం ఆరోపణపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కింది కోర్టుల ఉత్తర్వులను పిటిషన్ సవాలు చేసింది. ఈ కేసులో దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభకు అనర్హత వేటు పడింది.

Read More: Stepdaughter: కుమార్తెలపై సవతి తండ్రి అత్యాచారం, ఆపై గర్భం